ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇదేనా బెజవాడ కొత్త కలెక్టరేట్‌? - విజయవాడ జిల్లా కలెక్టరేట్​గా ఆర్అండ్​బీ భవనం

జిల్లాల పునర్విభజనకు సంబంధించి వివిధ శాఖల సమాచారాన్ని రాష్ట్ర అధికారులు క్రోడీకరిస్తున్నారు. సరిహద్దులు, రెవెన్యూ గ్రామాలు, జనాభా, ఓటర్లు, ఆదాయవనరులు, వ్యవసాయం, పారిశ్రామికం ఇతర వివరాలను ఆయా శాఖల నుంచి సేకరిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే విజయవాడ జిల్లాలో కలెక్టరేట్‌ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఆసక్తి కరంగా మారింది.

vijayawada district collectorate
ప్రతిపాదిత విజయవాడ జిల్లా కలెక్టరేట్

By

Published : Nov 1, 2020, 6:03 PM IST

విజయవాడ బందరు రోడ్డులో ఆర్‌ అండ్ ‌బీ భవనాన్ని కలెక్టరేట్‌గా మార్చాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రస్తుతం జీ+5 అంతస్తులుగా ఉన్న ఈ భవనంలో.. ఆర్‌ అండ్‌ బీ, ఏపీపీఎస్‌సీ, ఏపీటీఎస్‌ తదితర కార్యాలయాలు ఉన్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఈ భవనాన్ని.. కలెక్టరేట్‌గా మార్చనున్నారని తెలిసింది. ఈ భవనంలోని రాష్ట్ర కార్యాలయాలు విశాఖకు తరలించే వరకు.. సబ్ ‌కలెక్టరేట్‌ సముదాయాన్ని కలెక్టరేట్‌గా మార్చాలని రెండో ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. కొత్తగా కలెక్టరేట్‌ నిర్మాణం చేయాల్సిన అవసరం లేకుండా చూడాలనే భావనలో అధికారులు ఉన్నారు.

ప్రస్తుత జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కార్యాలయాలు ఎప్పుడూ ఖాళీగానే ఉంటున్నాయి. అధికారులంతా విజయవాడలోని క్యాంపు కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మచిలీపట్నం దూరమే. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుతం. విజయవాడ, గుడివాడ, నూజివీడు, బందరుల్లో రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. విజయవాడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 17 మండలాలు, బందరు పరిధిలో 13, గుడివాడ పరిధిలో 9, నూజివీడు డివిజను పరిధిలో 13 మండలాలు ఉన్నాయి. విజయవాడ జిల్లా ఏర్పాటైతే తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ నగరం పరిధిలోని తూర్పు, మధ్య, పశ్చిమ నియోజకవర్గాలు దాని పరిధిలోకి వస్తాయి.

ABOUT THE AUTHOR

...view details