ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్​ఎంపీలు కొవిడ్ వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు: కలెక్టర్​ ఇంతియాజ్ - ఆర్​ఎంపీలు, పీయంపీలకు కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరిక

జిల్లాలోని ఆర్​ఎంపీలు, పీయంపీలకు కొవిడ్ చికిత్స చేసేందుకు అనుమతి లేదని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిచి కొవిడ్ చికిత్సకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

collector imtiaz warning to rmps
collector imtiaz warning to rmps

By

Published : May 22, 2021, 6:48 PM IST

కృష్ణా జిల్లాలో ఆర్​ఎంపీలు, పీయంపీలు కొవిడ్ వైద్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. ఎపిడిమిక్ డిసీస్ యాక్ట్ ప్రకారం ఆర్​ఎంపీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కొవిడ్ సంబంధిత లక్షణాలు.. బ్రాంకీయల్ అస్మా, ఎల్​వీఎఫ్, ఏఆర్​డీ. ఎక్యూట్​మమో కార్డియల్ ఇన్​ఫెక్షన్​, వంటి తదితర లక్షణాలుంటే గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చికిత్స అందించాలన్నారు.

కావున పైన పేర్కొన్న కేసులకు సంబంధించి ఆర్​ఎంపీలు, పీఎంపీలు వైద్యం చేయకుండా.. గుర్తింపు పొందిన కొవిడ్ ఆస్పత్రికి పంపించాలన్నారు. అలా కాకుండా కొవిడ్ చికిత్సకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details