ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాప్యం చేసే ఆస్పత్రులపై చట్టపరమైన చర్యలు: కలెక్టర్ ఇంతియాజ్ - collector imtiaz

కరోనా బాధితుల డిశ్చార్జ్, మృతదేహాల అప్పగింతల విషయంలో జాప్యం చేస్తే సహేంచేది లేదన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్. కొన్ని ప్రయివేటు ఆస్పత్రుల తీరు సహేతుకంగా లేదని.. తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు.

collector imtiaz
collector imtiaz serious on private hospitals

By

Published : May 3, 2021, 9:02 PM IST

Updated : May 4, 2021, 3:52 PM IST

కరోనా బాధితుల డిశ్చార్జ్, మృతదేహాల అప్పగింతల విషయంలో కొన్ని ప్రయివేట్ ఆస్పత్రుల తీరుపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. జాప్యం చేయడంతో పాటు జులుం ప్రదర్శించటం సరికాదని కలెక్టర్ ఇంతియాజ్ ఓ ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో చికిత్సలు, అందుతున్న వైద్య సదుపాయాలు, సేవలపై సమీక్షించిన కలెక్టర్.. పలు ఘటనలపై చర్చించారు. ఇటువంటి చర్యలు సహేతుకం కాదని.. వీటిపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Last Updated : May 4, 2021, 3:52 PM IST

ABOUT THE AUTHOR

...view details