Cockfight: కృష్ణా జిల్లాలోని చందర్లపాడు, నందిగామ, కంచికచర్ల, నూజివీడు, ముసునూరు, అగిరిపల్లి, చాట్రాయి, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి, జగ్గయ్యపేట మండలాల్లో జోరుగా కోళ్ల పందేలు సాగుతున్నాయి. ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి, పందెంరాయుళ్లు పందెం కాస్తున్నారు. కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి బరిలోకి దింపుతున్నారు. ఈ పోటీల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి.
COCK FIGHT : జోరుగా కోళ్ల పందేలు.. చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు
Sankranti: కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ముదినేపల్లి, కైకలూరు, కలిదిండి, జగ్గయ్యపేట మండలాల్లోని అనేక గ్రామాల్లో కోడిపందేలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. శిబిరాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయని స్థానికులు అంటున్నారు.
జోరుగా కోళ్ల పందేలు
కోడి పందేలతో పాటు కోత ముక్కలాట, గుండాటలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. శిబిరాలు తొలగింపు పేరుతో నిన్న సాయంత్రం వరకు రెవెన్యూ, పోలీసు అధికారులు హడావుడి చేసినా... పోటీలు ప్రారంభమయ్యాక ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
ఇదీచదవండి.