విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు కీలక దశకు చేరుకున్నాయి. ఆశ్వయుజ శుద్ధపంచమి అయిన ఇవాళ అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి వరకు భక్తులు విశేష పుణ్యదినాలుగా భావిస్తారు. అందువల్ల దుర్గమ్మ దర్శనానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా అధికారులు 13 వేల మందికి మాత్రమే దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. వేకువజామున 3 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు భక్తులను అనుమతిస్తారు. టికెట్లలో కేటాయించిన సమయం ప్రకారమే దర్శనానికి రావాలని అధికారులు స్పష్టంచేస్తున్నారు.
మరోవైపు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
దుర్గమ్మకు నేడు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ - vijayawada latest news
రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులవిందుగా సాగుతున్నాయి. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి ఇవాళ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
cm jagan