వర్ల రామయ్య, ఆర్టీసీ ఛైర్మన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపైఉన్న అసూయతోనే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి విమర్శలు చేస్తున్నారని ఆర్టీసీ ఛైర్మన్ వర్లరామయ్య ఆరోపించారు. ఎన్టీఆర్ కాలం నుంచే తన తోడల్లుడు చంద్రబాబుపై దగ్గుబాటికోపం పెంచుకున్నారన్నారు. చంద్రబాబు మీద కక్షతోనే తన కొడుకును... నేరస్థుడైన జగన్ వద్ద చేర్పించారని మండిపడ్డారు. తాడేపల్లిలో జరిగిన వైకాపా అధ్యక్షుని గృహ ప్రవేశమంతా ఎన్నికల జిమ్మిక్కేనంటూ ఎద్దేవా చేశారు.