తెలంగాణలో కరోనా కట్టడికి గ్రామ సరిహద్దుల్లో వేసిన కంచెలు తొలగించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కంచెలు తీసేసి అదేచోట గంగాలం, నీళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కంచెలు తొలగించకపోతే ధాన్యం కొనుగోళ్లకు ఇబ్బందులు వస్తాయన్నారు.
'కంచెలు తొలగించి.. గంగాలం, నీళ్లు ఏర్పాటు చెయ్యండి' - updated news on cm kcr press meet
లాక్డౌన్ దృష్ట్యా గ్రామాల్లోకి ఎవరూ రాకుండా సరిహద్దుల్లో వేసిన ముళ్ల కంచెలను తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. పట్టువిడుపులతో కంచెలు తొలగించకపోతే సమస్యలు ఎదురవుతాయన్నారు.
'కంచెలు తొలగించి.. గంగాలం, నీళ్లు ఏర్పాటు చెయ్యండి'
సరిహద్దుల్లో కంచెలు వేస్తే గ్రామాల్లోకి నిత్యావసర వస్తువులు రావాలంటే ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. కరోనా రాకుండా జాగ్రత్తపడడం మంచిదే కానీ పట్టువిడుపులతో కంచెలు తొలగించకపోతే సమస్యలు వస్తాయని సూచించారు.