9 labourers stuck in Godavari river: భారీ వర్షాల కారణంగా జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు సమీపంలోని కుర్రు గ్రామంలో చిక్కుకున్నారు. మూడు రోజుల క్రితం పొలం పనుల కోసం గోదావరి నదిపై నిర్మించిన బోర్నపల్లి వంతెన అవతల ఉన్న కుర్రు గ్రామానికి వెళ్లారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో అక్కడే ఉండిపోయారు. దీంతో వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
నదిలో చిక్కుకున్న 9 మంది.. రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందం - labourers stuck in Godavari river
9 labourers stuck in Godavari river: తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, నదులు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయ పనుల కోసం వెళ్లిన 9 మంది కూలీలు.. గోదావరి నదీ సమీపంలోని కుర్రు గ్రామంలో చిక్కుకున్నారు. గత మూడు రోజులుగా బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారిని రక్షించాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం వారిని రక్షించింది.
1
దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్... కూలీలను రక్షించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు కూలీలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ దళాలను పంపారు. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం... వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.
ఇదీ చదవండి: