ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రానికి వ్యతిరేకంగా త్వరలోనే జాతీయ సదస్సు: సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్

త్వరలోనే కలిసి వచ్చే పార్టీలతో జాతీయ సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం సరికాదన్న ఆయన... ఎల్‌ఐసీ వంటి సంస్థలను అమ్మే అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

CM KCR criticizes national parties
కేంద్రానికి వ్యతిరేకంగా త్వరలోనే జాతీయ సదస్సు: సీఎం కేసీఆర్

By

Published : Nov 23, 2020, 6:17 PM IST

దేశాన్ని పాలించిన రెండు పార్టీలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల సందర్భంగా తెరాస మేనిఫెస్టో విడుదల చేసిన ఆయన... గ్రేటర్​పై వరాల జల్లు కురిపించారు. గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందన్న సీఎం... తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. కరోనా వేళ రోజూ 50 వేల మంది పేదలకు ఉచితంగా అన్నం పెట్టినట్లు వివరించారు.

దేశాన్ని పాలించిన రెండు పార్టీలు అట్టర్‌ఫ్లాప్‌ అయ్యాయి. దేశ ఆర్థిక వ్యవస్థను రెండు పార్టీలు నాశనం చేశాయి. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం. తాత్కాలిక భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం సరికాదు. ఎల్‌ఐసీ వంటి సంస్థలను అమ్మే అవసరం ఏమొచ్చింది? నవరత్న సంస్థలను ఎందుకు అమ్ముతున్నారు? బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను ఎవరి కోసం పణంగా పెడుతున్నారు? జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం తెరాస ముందుంటుంది. కలిసివచ్చే పార్టీలతో త్వరలో జాతీయ సదస్సు నిర్వహిస్తాం.

-తెరాస మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు

ఇదీ చూడండి:

పొంచి ఉన్న 'నివర్' తుపాను...అప్రమత్తమైన అధికారులు

ABOUT THE AUTHOR

...view details