కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని... వాటిని అరికట్టాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన సూచనను కేసీఆర్ అభినందిచారు. కరోనా చికిత్సకు అధిక ఛార్జీలు వసూలు చేయడం దారుణమంటూ వ్యాఖ్యానించారు. ప్రెవేటు ఆస్పత్రుల మీద కచ్చితంగా నిఘా పెడతామని కేసీఆర్... భట్టికి హామీ ఇచ్చారు.
''డబ్బులు అంత దుర్మార్గంగా సంపాదించి ఏమి చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. బాధ కూడా కలుగుతోంది. విపత్కర సమయంలో వాళ్ల బాధ్యతను మరిచి... శవాన్ని దగ్గర ఉంచుకుని గందరగోళం చేస్తూ... లక్షల్లో వసూలు చేయడం ధర్మం కాదు. భట్టి విక్రమార్కకు హామీ ఇస్తున్న. ఈ ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేసే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దాని వెనుక ఎవరున్న సహించేది లేదు.''