ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం ధరలు పెంచాక.. తాగేవారి సంఖ్య తగ్గింది: సీఎం - మన పాలన మీ సూచన తాజా వార్తలు

మద్యం దుకాణాలు నేరుగా ప్రభుత్వమే నిర్వహిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. మద్యం గొలుసు దుకాణాలు లేకుండా చేయగలిగామన్నారు.

cm jaganmohanreddy on Alcohol consumption
cm jaganmohanreddy on Alcohol consumption

By

Published : May 25, 2020, 1:33 PM IST

Updated : May 25, 2020, 4:13 PM IST

మద్యం ధరలు పెరిగాక 23 లక్షల కేసులు 10 లక్షలకు తగ్గిపోయాయని అధికారులు చెప్పినట్లు జగన్ తెలిపారు. 'మన పాలన-మీ సూచన' సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్టు షాపులను తొలగించామన్న జగన్.. షాక్ కొట్టేలా మద్యం ధరలు ఉంచాం.. తాగేవారి సంఖ్య తగ్గిందన్నారు. లిక్కర్ అమ్మకాలు 24 శాతం తగ్గగా.. బీరు అమ్మకాలు 50 శాతం తగ్గాయని తెలిపారు. మద్యం ధరలు పెంచాక వినియోగం మరింత తగ్గిందన్నారు.

మద్యం ధరలు పెంచాక.. తాగేవారి సంఖ్య తగ్గింది: సీఎం

ఇదీ చదవండి: అవినీతి లేని గొప్ప వ్యవస్థను తయారు చేశాం: సీఎం జగన్‌

Last Updated : May 25, 2020, 4:13 PM IST

ABOUT THE AUTHOR

...view details