New Year Wishes: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం తెలుగు ప్రజలు అందరికీ సంతోషాన్ని, శాంతిని అందించాలని ఆకాంక్షించారు. 2022 సంవత్సరం.. ఉజ్వల భవిష్యత్తు కోసం వేచి చూడటానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, నూతన లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ఒమ్రికాన్ వేరియంట్ ఆవిర్భావంతో కరోనా ముప్పు మరింత పెరిగిందని, అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా కుటుంబ సభ్యులతో కలిసి తమ నివాసాలలోనే వేడుకలను జరుపుకోవాలని.. సూచించారు.
సాధారణ ప్రజానీకం, ప్రముఖులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపే సంప్రదాయ విధానాన్ని.. ఈ ఏడాది కూడా రద్దు చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. ఇలా చేస్తున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రకటించారు.