బహ్రెయిన్‌లో పని చేస్తున్న రాష్ట్రానికి చెందిన కార్మికులను స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు ఆయన లేఖ రాశారు. బహ్రెయిన్‌లో పనిచేస్తున్న కార్మికుల్లో.. రాష్ట్రానికి చెందినవారు అధికంగా ఉన్నారని లేఖలో వివరించారు. అక్కడ వారిని ఆయా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయని పేర్కొన్నారు. వారిని త్వరగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
CM JAGAN: రాష్ట్ర కార్మికులను భారత్‌కు తీసుకురావాలి.. కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ - రాష్ట్ర కార్మికులను భారత్‌కు తీసుకురావాలని జైశంకర్‌కు లేఖ
కేంద్ర మంత్రి జైశంకర్‌కు జగన్ లేఖ
14:05 September 13
స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసిన సీఎం
బహ్రెయిన్ నుంచి కార్మికులను స్వదేశానికి తీసుకొచ్చే విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎంవో కార్యాలయం అధికారులు.. కార్మికులకు సంబంధించిన అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో వివరించారు.
ఇదీ చదవండి:
Last Updated : Sep 13, 2021, 3:12 PM IST