ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త 108,104 వాహనాలను ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. మొత్తం 1068 వాహనాలను బెంజిసర్కిల్ వద్ద ప్రారంభిస్తారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్‌కాల్ వచ్చిన 25 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో ..108అంబులెన్స్ ఘటనా స్థలికి చేరుకునేలా విధివిధానాలు నిర్ణయించినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో 412 కొత్త 108 వాహనాలు రోడ్డెక్కనున్నట్లు అధికారులు తెలిపారు. 656 నూతన 104 వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా మండలానికొకటి చొప్పున అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్‌కు... ఎలాంటి అంతరాయం లేకుండా వాహన రాకపోకల్ని మళ్లించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు
కొత్త 108, 104 వాహనాలను ఇవాళ ప్రారంభించనున్న సీఎం జగన్
ఆపత్కాలంలో ప్రథమ చికిత్స అందించే 108తోపాటు 104 అంబులెన్సులు సరికొత్తగా సేవలందించేదుకు సిద్ధమయ్యాయి. మొత్తం 1068 వాహనాలు అత్యాధునిక సౌకర్యాలతో రోడ్డెక్కనున్నాయి. బెజవాడ బెంజ్ సర్కిల్ లో నేడు సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఇవాళ కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్
Last Updated : Jul 1, 2020, 4:38 AM IST