విజయవాడ కృష్ణా తీరంలో దేవాలయాల నిర్మాణం, సహా విగ్రహాల పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటల ఒక నిమిషానికి సీఎం జగన్ 9 దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కోటి 79 లక్షలతో వీటిని తిరిగి నిర్మించేందుకు ముఖ్యమంత్రి జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.
కృష్ణాతీరంలో దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన - దేవాలయాల పునర్నిర్మాణ వార్తలు
విజయవాడ కృష్ణాతీరంలోని పలు దేవాలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
పలు దేవాలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
అనంతరం ఇంద్రకీలాద్రి వెళ్లి కనక దుర్గమ్మ అమ్మవారిని సీఎం దర్శించుకుంటారు. ఆ తర్వాత దుర్గ గుడిలో 70 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు CM శంకుస్థాపన చేస్తారు. ఏర్పాట్లను మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస రావు పరిశీలించారు. నిర్మించనున్న దేవాలయాల చుట్టు పచ్చదనం సహా సదుపాయాలను పురపాలక శాఖ కల్పిస్తుందని మంత్రి బొత్స తెలిపారు.
ఇదీ చదవండి