రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్ - CMs level Meeting at Delhi
12:17 September 24
రెండు రోజులపాటు దిల్లీలో పర్యటించనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్.. రేపు దిల్లీకి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేపు సాయంత్రం దిల్లీకి బయలుదేరనున్నారు. ఈనెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో జగన్ పాల్గొంటారు.
అపాయింట్మెంట్ దొరికితే హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు రోజులపాటు దిల్లీలో జగన్ పర్యటన కొనసాగనుంది.
ఇదీ చదవండి..