దిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిందని... సీఎం జగన్ అన్నారు. వారందరినీ గుర్తించి పూర్తి క్వారంటైన్‌లో ఉంచామన్నారు. మొత్తం మీద పరిస్థితి అదుపులో ఉందనే చెప్పుకోవచ్చని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో... సాధారణ పరిస్థితులు నెలకొంటాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్లు, కొవిడ్ ఆస్పత్రుల వైద్యులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి... సీఎం వీడియోకాన్ఫరెన్స్ చేశారు. కరోనాపై యుద్ధంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది.... రిస్క్ ఉంటుందని తెలిసీ చాలా కష్టపడి సేవ చేస్తున్నారని ప్రశంసించారు. కరోనా భయాలను పక్కనపెట్టి... వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.
పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎం జగన్ - సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్
కరోనాపై పోరులో వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు అమోఘమని... వారందరికీ సెల్యూట్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్