CM Jagan: ప్రజల ప్రేమ, ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోందంటూ.. ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 95 శాతానికి పైగా హామీలు అమలు చేశామని చెప్పారు. ఎన్నో మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ట్వీట్‌లో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ప్రేమాభిమానాలు తనపై ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.
CM Jagan: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హామీల అమలు.. మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్ - మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ట్వీట్
CM Jagan: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. సంక్షేమ పాలనతో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా.. ప్రజల ప్రేమ, ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోందంటూ.. ఆయన ట్వీట్ చేశారు.
సీఎం జగన్
ముగిసిన దావోస్ పర్యటన.. సీఎం జగన్ దావోస్ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ ఉదయం 11గంటలకు జ్యూరిక్ విమానాశ్రయం నుంచి బయల్దేరనున్న ముఖ్యమంత్రి.. అర్ధరాత్రి 12.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి 1.15 గం.కు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.
ఇవీ చూడండి: