కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్ ఘన నివాళి అర్పించారు. "తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి" అని సీఎం జగన్ ట్వీటర్లో పేర్కొన్నారు.
వైకాపా కేంద్ర కార్యాలయంలో..
తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలా అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి
Sajjala: 'మంచి చేయాలని చూస్తున్నాం.. బురద చల్లాలని చూస్తే పవన్‌కే ఇబ్బంది'