ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN: శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమ సందర్శనకు సీఎం - సీఎం జగన్

విజయవాడ నగరంలోని అవదూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని సీఎం జగన్ సందర్శించనున్నారు. దీనికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలించారు.

CM JAGAN
CM JAGAN

By

Published : Oct 16, 2021, 10:57 PM IST

విజయవాడ పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని.. ఈ నెల 18న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు. శ్రీ దత్తనగర్ లోని అవదూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని సీఎం సందర్శిస్తారు. అనంతరం మరకత రాజరాజేశ్వరిదేవిని దర్శించుకోనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను భద్రత అధికారులు, ఇతర పోలీసు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా... పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ మళ్లింపు, ఇతర అంశాలపై ఉన్నతాధికారులతో ఆయన చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details