Input Subsidy to farmers: ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. 2021 నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 5,71,478 మంది రైతులకు.. రూ.534.77 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని సీఎం విడుదల చేయనున్నారు.
వైఎస్సార్ యంత్రసేవా పథకం కింద.. 1,220 రైతు గ్రూపులకు రూ.29.51 కోట్ల లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం రూ.564.28 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్.. రైతుల ఖాతాలో నగదును జమ చేయనున్నారు.