ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Spandana Video Conference: అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు: సీఎం జగన్ - స్పందన వీడియో కాన్ఫరెన్స్ న్యూ్స

స్పందనపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగనన్న శాశ్వత గృహహక్కు పథకం, ఇళ్ల నిర్మాణ ప్రగతి, వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్బీకేల నిర్మాణాల ప్రగతి, విలేజ్ అర్బన్ హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు, గ్రామ సచివాలయాల గురించి సీఎం జగన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలపై సీఎం అధికారులతో చర్చించారు. ఖరీఫ్ అవసరాలు, రబీ సన్నద్ధతపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు
అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు

By

Published : Oct 21, 2021, 7:33 PM IST

అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు

స్పందనపై ముఖ్యమంత్రి జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పేదలందరికీ ఇళ్లు, ఉపాధి హామీ, వ్యవసాయం, తదితర అంశాలపై చర్చించారు. ఉపాధిహామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇ–క్రాపింగ్​పై కలెక్టర్లు, జాయంట్‌ కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. సీఎం – యాప్​పైనా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.

కౌలు రైతులందరికీ పంట రుణాలు

ధరల విషయంలో ఎక్కడైనా నిరాశజనక పరిస్థితులు ఉంటే.. సీఎం యాప్‌ద్వారా పర్యవేక్షణ చేసి వెంటనే రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలన్నారు. ఇ–క్రాపింగ్‌ ఉంటనే పంటల బీమా, సున్నావడ్డీ, పంట కొనుగోళ్లు, ఇన్‌పుట్‌సబ్పిడీ సవ్యంగా జరుగుతాయని గ్రామంలోని ప్రతి ఎకరా ఇ–క్రాపింగ్‌ జరగాల్సిందేనన్నారు. అగ్రికల్చర్‌ అడ్వైయిజరీ మీటింగ్స్‌ కచ్చితంగా జరిగేలా చూడాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు నాణ్యమైన వాటిని ఆర్బీకేల ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఆర్బీకేల ద్వారా ఇస్తున్న వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందన్నారు. రైతులు అడిగిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సంబంధిత ఆర్బీకే ద్వారా సరఫరా కావాలన్నారు. కౌలురైతులందరికీ పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి రుణాలు అందేలా కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. రబీకి అవసరమైన విధంగా అధికారులు సన్నద్ధం కావాలన్నారు. అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత అమలు చేయనున్నట్లు సీఎం చెప్పారు. 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల అమలుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఏటా రెండు సార్లు కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు

దాదాపు 80 శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని సీఎం తెలిపారు. మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బందికి కూడా వారు పనితీరును మెరుగుపరిచేలా తోడ్పాటును అందించాలన్నారు. వాలంటీర్లు ఆశించిన రీతిలో సేవలను అందించకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలని, ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. అక్టోబరు 29, 30 తేదీల్లో సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ కార్యక్రమం చేపట్టాలని, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు..బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలన్నారు. నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలని, ఇందులో సిబ్బంది, వాలంటీర్లు తప్పక పాల్గొనాలన్నారు. నెలలో మూడో బుధవారం జిల్లా స్థాయిలో సమావేశాలు జరగాలన్నారు. ఇకపై ఏటా రెండు సార్లు పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇక నుంచి జూన్, డిసెంబరుల్లో దీన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు.

భూ వివాదాలకు చెక్..

జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై సమీక్షించిన సీఎం..ఈ పథకం విప్లవాత్మకమైనదన్నారు. 100 సంవత్సరాల క్రితం సర్వేచేశారని...100 ఏళ్ల తర్వాత సర్వే, రికార్డులను అప్‌డేట్‌ చేస్తున్నామన్నారు. సర్వే ద్వారా గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్‌ పడుతుందన్నారు. గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు ఉంటుందన్న సీఎం.. పైలట్‌ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోందన్నారు. మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌ కల్లా పూర్తవుతుందని, 2023 జూన్‌ కల్లా మొత్తం సర్వే ప్రక్రియ ముగుస్తుందని స్పష్టం చేశారు. సర్వే అవగానే రికార్డులు అప్‌డేట్‌ చేసి కొత్త పాసు పుస్తకాలు యజమానులకు ఇస్తామన్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై సీఎం సమీక్షించారు. డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ పథకం వల్ల 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారని, వీరి చేతికి పట్టాలు అందుతాయన్నారు. వారి ఇంటి స్థలం మీద వారికి అన్నిరకాల హక్కులు వస్తాయని దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు.

నిర్మాణాలు వేగవంతం చేయాలి

కృష్ణా, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు గ్రామ సచివాలయాల నిర్మాణాల విషయంలో వెనకబడి ఉన్నారన్న సీఎం..వెంటనే సచివాలయాల భవనాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రాల భవనాలను పూర్తి చేయటంపై కర్నూలు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లు దృష్టి పెట్టాలన్నారు. తొలివిడతలో గ్రామాల్లో 4,314 లైబ్రరీలను నిర్మిస్తున్నామన్న సీఎం, వీటి నిర్మాణానికి సంబంధించి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి

Jagan: అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్ర: సీఎం జగన్‌

ABOUT THE AUTHOR

...view details