కలెక్టర్లు, ఎస్పీల వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక ప్రారంభం కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. అక్టోబర్ 5న పిల్లలకు జగనన్న విద్యా కానుక కిట్ అందజేస్తామన్నారు. అక్టోబర్ 2న దాదాపు 2 లక్షల మందికి ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పంపిణీ చేశామని.. అక్టోబర్ నెలాఖరున జగనన్న తోడు పథకం ప్రారంభిస్తామని సీఎం తెలిపారు. వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు జగన్ పేర్కొన్నారు. అర్హులకు వచ్చే నెల 10లోగా బ్యాంకులు రుణాలు ఇచ్చేలా కలెక్టర్లు చూడాలని సూచించారు.
నవంబర్ 2న పాఠశాలలు తెరవాలని సీఎం జగన్ నిర్ణయం - జగనన్న విద్యా కానుక కిట్లు అక్టోబర్ 5న ప్రారంభం తాజా వార్తలు
నవంబర్ 2న పాఠశాలలు తెరవాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ తెలిపారు. గతంలో అక్టోబర్ 5న పాఠశాలలు తెరవాలనుకున్నా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా నవంబర్ 2కు వాయిదా వేశామన్నారు.
నవంబర్ 2న పాఠశాలలు తెరవాలని సీఎం జగన్ నిర్ణయం
పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై సమీక్షించిన సీఎం జగన్.. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అనుకుంటున్నామన్నారు. పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పంపాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల స్థలాల పంపిణీకి సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ఇదీ చదవండి:దర్యాప్తు బాధ్యత పోలీసులదా? ప్రతిపక్షానిదా?: చంద్రబాబు
Last Updated : Sep 29, 2020, 7:41 PM IST