ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: ఇళ్ల నిర్మాణ రుణాలు తీసుకున్నవారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌: సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు

గతంలో ప్రభుత్వం నుంచి ఇల్లు పొందిన వారికి వాటిపై హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 60 లక్షల మంది లబ్ధిదారులకు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయాలని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలనూ వేగవంతం చేయాలన్నారు.

ఇళ్ల నిర్మాణ రుణాలు తీసుకున్నవారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌
ఇళ్ల నిర్మాణ రుణాలు తీసుకున్నవారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌

By

Published : Sep 20, 2021, 6:52 PM IST

గృహనిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ నుంచి రుణాలు తీసుకున్న వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. దీనికి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకంగా పేరు ఖరారు చేశారు. పథకం అమలు కోసం రూపొందించిన విధివిధానాలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. అధికారులు తయారుచేసిన ప్రతిపాదనలను పరిశీలించారు. సెప్టెంబరు 25 నుంచి డేటాను అప్‌లోడ్‌ చేయనున్నట్లు హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డేటాను సచివాలయాలకు పంపి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలన్న సీఎం..పథకం అమలుకు గ్రామ, వార్డు సచివాలయాలు పాయింట్‌గా ఉండాలని నిర్దేశించారు.

సచివాలయాల్లోనే వన్‌టైం సెటిల్‌మెంట్‌ పథకం సొమ్ము చెల్లించేలా వెసులుబాటు కల్పించనున్నట్లు సీఎంకు నివేదించిన అధికారులు.. అర్హులైన వారి జాబితాలు ప్రదర్శించి, నిర్దేశిత రుసుము చెల్లింపుతో వారికి ఇంటిపైన, స్థలాలపైన పూర్తి హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు వివరించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం ఆరా తీశారని సమీక్ష తర్వాత వెల్లడించిన మంత్రి బొత్స...ఇంతకు ముందు చెప్పినట్లుగానే 80 వేల మంది లబ్ధిదారులకు డిసెంబర్‌లో టిడ్కో ఇళ్లు అప్పగించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.

పేదలందరికీ ఇళ్ల నిర్మాణ ప్రగతిపైనా అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జగన్‌.. అందుకు అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. మూడో ఆప్షన్‌ కింద ప్రభుత్వం కట్టించే ఇళ్ల నిర్మాణ పనులు అక్టోబరు 25న ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు, మేస్త్రీలతో కలిపి 18 వేలకుపైగా గ్రూపులు ఏర్పాటు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఖర్చులు తగ్గించుకునే విధానాల్లో భాగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న లేఅవుట్ల వద్దే ఇటుక తయారీ యూనిట్లను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయన్నారు. మిగిలిన నిర్మాణ సామగ్రి ధరలను, ఖర్చులను అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై డీపీఆర్‌లు సిద్ధం చేశామని అధికారులు వివరించగా... కాలనీ ఒక యూనిట్‌గా పనులు అప్పగించాలని జగన్‌ నిర్దేశించారు.

ఇదీ చదవండి

సొంత పార్టీ ఎంపీపై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details