CM JAGAN: పౌర సేవలు వేగంగా, పారదర్శకంగా అందించాలనే ఉద్దేశంతో ఏపీ సర్కార్ 'ఏపీ సేవా' పేరిట సిటిజన్ సర్వీస్ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రజల అర్జీలు శాఖలవారీగా విడివిడిగా కాకుండా.. ఒకే పోర్టల్ పరిధిలోకి తెచ్చారు. ఈ మేరకు అభివృద్ధి చేసిన 'ఏపీ సేవ 2.O పోర్టల్'ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. రెవెన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35రకాల సేవలు పోర్టల్ పరిధిలోకి తెచ్చామన్నారు.
Cm jagan on CSWS 2.0: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540కి పైగా సేవలను అందిస్తున్నట్లు తెలిపిన సీఎం.. ఈ పోర్టల్ ద్వారా రెవెన్యూ, భూపరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను అదనంగా తీసుకొచ్చామన్నారు. మున్సిపాలిటీలకు చెందిన 25, పౌరసరఫరాలకు చెందిన 6, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ రంగానికి చెందిన 53కు పైగా సేవలు ఈ పోర్టల్ కిందికి తీసుకొచ్చినట్లు జగన్ వివరించారు.
ఏపీ సేవ పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ వేగంగా ప్రభుత్వ పథకాలు అమలవుతాయని చెప్పారు. ప్రజలు పలకడానికి అనువుగా ఉండేందుకు పోర్టల్‌కు ‘ఏపీ సేవ’ అని పేరు పెట్టినట్లు జగన్ తెలిపారు. గ్రామస్వరాజ్యంలో ఏపీ సేవ పోర్టల్ ఓ గొప్ప ముందడుగని చెప్పారు. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పోర్టల్‌తో మారుమూల గ్రామాల్లోనూ పాదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.
మే నాటికి సచివాలయాల్లో పూర్తిస్థాయి ఆధార్ సేవలు