cm jagan review on new districts : కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రణాళికావిభాగం కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితర అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు, మంత్రులు నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఇప్పటి వరకూ 9 వేలకు పైగా ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటికే కొన్ని పరిష్కరించామని అధికారులు.. సీఎంకు వివరించినట్టు తెలుస్తోంది.
cm jagan review : ఈ నెల 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్! - ap latest news
cm jagan review on new districts : కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వచ్చిన అభ్యంతరాలు సీఎం పరిశీలించారు. ఈ నెల 31న కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పేర్లు మార్చాలని, రెవెన్యూ డివిజన్లను మార్చాలని కోరుతూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలపై సీఎం చర్చించినట్టు సమాచారం. మరోవైపు జిల్లాల విభజనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేసిన మార్పులపైనా సీఎస్.. ముఖ్యమంత్రికి వివరించినట్టు తెలుస్తోంది. దాదాపు గంటన్నరపాటు ముఖ్యమంత్రి దీనిపై సమీక్షించారు. మార్చి 31 తేదీన కొత్త జిల్లాల తుది నోటిఫికేషన్ను జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి :రాత్రి 8.30 నుంచి 9.30 వరకు ఎర్త్‌అవర్ పాటించండి: గవర్నర్