ప్రభుత్వ పాఠశాలల్లో ‘నాడు-నేడు’పై సీఎం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 'విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ఉపాధ్యాయులను నియమించాలి. ఏ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్న దానిపై మ్యాపింగ్ చేయాలి. అధికారులంతా కూర్చొని ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు విధివిధానాలు రూపొందించాలి’’ అని ఆదేశించారు. 2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 పాఠశాలలకు ఏకోపాధ్యాయుడిని కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతపడ్డాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. గతంలో అవలంబించిన విధానాల వల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందని జగన్ విమర్శించారు.‘‘పిల్లలు నేర్చుకునే విధానం, ప్రతిభపై నిరంతర అధ్యయనం జరగాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఇది జరగాలి. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనకబడ్డారో గుర్తించి, సమస్యలను అధిగమించేందుకు విధానాలు రూపొందించాలి. ప్రభుత్వ బడుల్లో మంచి చదువులు అందించేందుకు అధికారులు ఆలోచించాలి. డిజిటల్ అభ్యాసం కోసం యాప్‌ను రూపొందించాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి వీడియో కాల్ సదుపాయం ఉండాలి.' అని సీఎం ఆదేశించారు.
- టోల్ ఫ్రీ నంబరు..
పాఠశాలల్లో సదుపాయాలపై టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు దీనికి ఫోన్ చేసేలా దానిని ప్రదర్శించాలి. పాఠశాలలు, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న బల్లలు, ఫర్నిచర్, సామగ్రిని పరిశీలించారు. నాడు-నేడు పనుల్లో నాణ్యత ఎలా పెంచాలన్నదానిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఆగస్టు 3న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నందున జులై చివరి నాటికి పనులన్నీ పూర్తి చేయాలన్న సీఎం.. ప్రభుత్వం అంటే నాసిరకం కాదు..నాణ్యతన్న పేరు రావాలన్నారు. ఇది నా మనసుకు నచ్చిన కార్యక్రమం అని వెల్లడించారు.
- కేంద్రీయ కొనుగోళ్లతో నాణ్యత