నాడు-నేడు(nadu nedu), జగనన్న విద్యా కానుకపై(jagananna vidya kanuka) సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు సురేష్, తానేటి వనిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నాడు-నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన అనంతరం తీసిన ఫొటోలను ప్రదర్శించాల్సిందిగా ప్రభుత్వం గతంలోనే ఆదేశాలిచ్చింది. మౌలిక సదుపాయాల నిర్వహణపై ప్రామాణిక విధానాన్ని అనుసరించాలని సూచించింది. పథకాన్ని ఇంటర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్, ఐటీఐలు, ఇతర వైద్యారోగ్య సంస్థలకూ వర్తింపజేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం అప్పట్లోనే వెల్లడించింది.