నాబార్డు ఆర్థిక సహాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం జగన్, నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కింద జరుగుతున్న పనులను నాబార్డు ఛైర్మన్‌కు విద్యాశాఖ అధికారులు వివరించారు. పాఠశాలల్లో కల్పించిన 10 రకాల సదుపాయాలను వివరించారు. తొలివిడతలో నాడు-నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు 652 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. మిగిలిన వాటిల్లోనూ మరో 2 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నాబార్డు ఛైర్మన్‌ను విద్యాశాఖ అధికారులు కోరారు. వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ పేరుతో అంగన్‌వాడీల్లో చేపడుతున్న కార్యక్రమాలను నాబార్డు ఛైర్మన్‌కు వివరించిన అధికారులు.. ప్రజారోగ్య రంగంలో చేపడుతున్న పనులను, వివరాలను అందించారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని..,తగిన విధంగా రుణ సహాయం అందించాలని కోరారు.
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.. ఆర్బీకేలు, మల్టీపర్సస్ సెంటర్లు, ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాలు, జనతా బజార్లను తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు నాబార్డ్ ఛైర్మన్‌కు వివరించారు. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు వివరాలను అధికారులు తెలిపారు.
జగన్ నవరత్నాల ముఖ్యమంత్రి