ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan: ఉపాధి పనులతో.. వక్ఫ్ భూముల చుట్టూ సరిహద్దు గోడల నిర్మాణం: సీఎం

By

Published : Aug 9, 2021, 5:36 PM IST

మైనారిటీ శాఖలో పెండింగ్‌ సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలన్నారు. మైనారిటీ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఉపాధి పనుల ద్వారా సరిహద్దు గోడలు నిర్మించడాన్ని పరిశీలించాలని సూచించారు.

cm jagan review on minority welfare
వక్ఫ్‌ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి

వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. మైనారిటీ సంక్షేమ శాఖపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. వక్ఫ్‌ భూముల చుట్టూ సరిహద్దు గోడ నిర్మించాలని చెప్పారు. ఉపాధి పనుల ద్వారా ఈ పనులు చేసే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. కర్నూలులో వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

మైనారిటీ శాఖలో పెండింగ్‌ సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. షాదీఖానాల నిర్వహణను మైనారిటీ శాఖకు బదిలీ చేయాలన్నారు. ఇమామ్, మౌజమ్​లకు సకాలంలోనే గౌరవ వేతనం అందేలా చూడాలని చెప్పారు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో హజ్‌ హౌస్‌ నిర్మాణానికి సీఎం అంగీకారం తెలిపారు. గుంటూరు జిల్లాలో నిలిచిన క్రిస్టియన్‌ భవన్‌ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details