ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓటీఎస్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించి లబ్ధిదారులకు రుణాలందేలా చూడాలి: సీఎం జగన్

ఓటీఎస్ పథకంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 'జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం' కింద త్వరితగతిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగించి లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తద్వారా లబ్దిదారులందరికీ రుణాలు అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు.

By

Published : Feb 28, 2022, 9:17 PM IST

Published : Feb 28, 2022, 9:17 PM IST

సీఎం జగన్
సీఎం జగన్

'జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం' కింద ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్‌ చేతుల మీదుగా గుంటూరు కార్పొరేషన్‌కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందుకున్నారు. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వీరికి రుణాలు మంజూరుచేసింది. కనిష్ఠంగా రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఓటీఎస్‌ లబ్ధిదారులకు ఈ బ్యాంకు రుణాలు ఇస్తోంది.

ఓటీఎస్‌ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగించి లబ్ధిదారులకు రుణాలందేలా చూడాలి

ఓటీఎస్ పథకంపై సమీక్షించిన సీఎం జగన్ త్వరగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగించి లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. తద్వారా లబ్దిదారులందరికీ రుణాలు అందించేలా బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో ఇంటిపై గరిష్టంగా రూ.3 లక్షల వరకూ రుణం అందించాలని బ్యాంకులు నిర్ణయించినట్లు తెలిపారు. ఓటీఎస్‌ పథకం ద్వారా క్లియర్‌ టైటిల్స్‌ పొందిన వారికి బ్యాంకులు భారీగా రుణ సదుపాయాన్ని కల్పించడం ప్రారంభించినట్లు తెలిపారు. లబ్ధిదారులకు రుణాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details