జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై (jagananna sampurna gruha hakku scheme) ముఖ్యమంత్రి జగన్ (CM jagan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ (CS) డాక్టర్ సమీర్ శర్మ, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో లబ్ధిదారుల గుర్తింపుపై సమీక్షలో చర్చించారు. ఇప్పటివరకూ 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. 45.63 లక్షల లబ్ధిదారుదాల డేటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేసినట్లు వెల్లడించారు. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిశీలించి వారికి అప్రూవల్స్ (Aprovels) ఇస్తున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అప్రూవల్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ (Registration with clear title) చేయనున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్ ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు (Enquiry) కూడా నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలన్నారు. ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయని..,ఈ విషయంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. పథకం అమలుపై దిగువ స్థాయి అధికారులకు, లబ్ధిదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్. జాప్యం లేకుండా దరఖాస్తులు అప్రూవల్ చేయాలి. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలి. ఆస్తులపై హక్కులు దఖలు పడతాయని అవగాహన కల్పించాలి. పథకం అమలుపై అధికారులు, లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్‌లో పారదర్శకత పాటించాలి. ఈనెల 20 నుంచి డిసెంబరు 15 వరకు రిజిస్ట్రేషన్ చేయాలి. -జగన్, ముఖ్యమంత్రి