ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan Review On PRC: ఫిట్​మెంట్​పై సీఎం సమీక్ష.. స్పష్టత వచ్చేది అప్పుడే! - cm jagan today news

CM Jagan Review On PRC: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఇతర డిమాండ్లపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిట్‌మెంట్, డిమాండ్ల అమలుతో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వివరాలను సీఎంకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన వివరించారు.

CM jagan  review on prc
సీఎం జగన్​ సమీక్ష

By

Published : Dec 17, 2021, 1:58 PM IST

Updated : Dec 17, 2021, 3:17 PM IST

CM Jagan Review On PRC:ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, ఇతర డిమాండ్లపై ముఖ్యమంత్రి జగన్ వరుసగా రెండో రోజూ​ సమీక్షించారు. సమీక్షలో పాల్గొన్న మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. నిన్న ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఎంత శాతం ఇవ్వాలనే అంశంతోపాటు సీపీఎస్ రద్దు, ఒప్పంద సిబ్బంది క్రమబద్ధీకరణ అంశాలపై ముఖ్యమంత్రి రెండు గంటలపాటు చర్చించారు.

ఫిట్​మెంట్, డిమాండ్ల అమలు వల్ల ఖజానాపై ఎంతమేర భారం పడుతుందనే అంశంపై సమీక్షలో చర్చించారు. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ చర్చించి ఫిట్​మెంట్ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగుల ఇతర డిమాండ్లైన సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపైనా సోమవారం సీఎం స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Dec 17, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details