ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి తరగతిలో డిజిటల్‌ బోధన.. విద్యా సమీక్షలో సీఎం జగన్​

CM REVIEW: విద్యాశాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోధన చేయాలని.. ఇంటరాక్టివ్‌ టీవీలు, ప్రొజెక్టర్లతో బోధించాలని సీఎం జగన్‌ సూచించారు. స్మార్ట్‌ బోధనతో పిల్లలు, టీచర్లకు మేలు జరుగుతుందన్న సీఎం.. ప్రీ ప్రైమరీ నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్‌ టీవీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

CM REVIEW
CM REVIEW

By

Published : Jul 22, 2022, 6:11 PM IST

CM REVIEW: తరగతి గదుల్లో డిజిటల్‌ సదుపాయాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రతి తరగతి గదిలోనూ ‘డిజిటల్‌’ బోధన చేపట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి రెండో తరగతి వరకు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 3నుంచి ఆపై తరగతులకు ప్రొజెక్టర్లు పెట్టేలా ఆలోచన చేయాలన్నారు. నాడు-నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో మొదటి దశ కింద ఏర్పాటు చేయాలని.. వచ్చేవారం నాటికి దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లతో పిల్లలకు మరింత విజ్ఞానం వస్తుందని సీఎం అన్నారు. తరగతి గదుల్లో అమర్చే ప్రొజెక్టర్‌లు, ఇంటరాక్టివ్‌ టీవీలు నాణ్యమైనవిగా ఉండాలని ఆదేశించారు.

విద్యాశాఖలో చేపట్టిన నాడు- నేడు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. నాడు-నేడు రెండోదశ కింద 22 వేల 344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్నారు. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలన్నారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్​లపైనా సీఎం చర్చించారు. ట్యాబ్‌లన్నీ నాణ్యంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ట్యాబ్‌ల్లోకి బైజూస్ కంటెంట్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details