ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీపీఎస్ జాబితాలోకి ఆర్టీసీ ఉద్యోగులు: సీఎం జగన్ - సీపీఎస్​పై సీఎం జగన్​ రివ్య్యూ న్యూస్

కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్ (సీపీఎస్‌), కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీపీఎస్​కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విషయం‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం, సీఎస్‌ నేతృత్వంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీలు, అంతకు ముందు ఇచ్చిన టక్కర్‌ కమిటీ నివేదికను సైతం సీఎం జగన్ పరిశీలించారని అధికారులు తెలిపారు.

cm jagan review on cps
cm jagan review on cps

By

Published : Nov 12, 2020, 7:15 PM IST

Updated : Nov 13, 2020, 1:40 AM IST

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్​తో పాటు.. రాష్ట్రంలోని తాత్కాలిక ఉద్యోగుల విషయమై.. ముఖ్యమంత్రి జగన్.. ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎస్, సంబంధిత మంత్రులు, అధికారులు హాజరై.. పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని అధికారులు వివరించారు. వారిలో నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు 1,78,705 కాగా... గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉన్నారని.. మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని వెల్లడించారు. వారికి ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందన్న వివరాలను ప్రస్తావించారు.

వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్, ప్రభుత్వంలో విలీనం చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ఆ జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక (టేబుల్‌) సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై జరిగిన సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ అమలు చేశామని చెప్పారు. అదే విధంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని వెల్లడించారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉన్నందున, ఆ ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు తగిన విధి విధానాలు రూపొందించాలని జగన్‌ ఆదేశించారు.

ఇదీ చదవండి:

సలాం కుటుంబానిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: చంద్రబాబు

Last Updated : Nov 13, 2020, 1:40 AM IST

ABOUT THE AUTHOR

...view details