కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ జరగటానికి వీల్లేదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖలో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా కొవిడ్ నివారణ, నియంత్రణ, సంసిద్ధతపై సమీక్ష నిర్వహించిన జగన్.. కొవిడ్ రోగులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించాలని తేల్చి చెప్పారు.
నిత్యం సగటున 1.4 లక్షల మందికి కరోనా టీకా వేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. తగినన్ని డోసులు అందుబాటులో లేవని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మన అవసరాలకు సరిపడా డోసులు వచ్చేలా చూడాలన్న జగన్.. రోజుకు రూరల్‌లో 4 లక్షలు, అర్బన్‌లో 2 లక్షల టీకాలు వేయాలని దిశానిర్దేశం చేశారు.