పశు సంవర్ధక, పాడి, మత్స్యశాఖలపై మంత్రి సీదిరి అప్పలరాజు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. చేపలు, రొయ్యలు వంటి మత్స్య ఉత్పత్తుల వినియోగం పెరగాలని సీఎం సూచించారు. సరసమైన ధరలకే మత్స్య ఉత్పత్తులు ప్రజలకు చేరాలని.. ఈ లక్ష్యాలను చేరుకునేందుకే ఆక్వా హబ్‌లు తీసుకొచ్చామన్నారు. స్థానిక మార్కెట్‌ను విస్తరించడం వల్ల రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 4.36లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం ఉందని, దీన్ని ఏడాదికి 12 లక్షల మెట్రిక్ టన్నులు చేయాలన్నది లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారించాలని.. పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఆక్వా రంగానికి బీమా సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. సీడ్, ఫీడ్ విషయంలో ఎక్కడా కల్తీ లేకుండా ఉండాలన్నారు. ఆక్వా లాబ్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 35 ల్యాబ్స్‌లో ఇప్పటికే 14 ప్రారంభం కాగా.. మరో 21 ల్యాబ్స్ నవంబర్‌లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఆక్వాకల్చర్ ల్యాబ్‌లను రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)కు అనుసంధానం చేయాలన్నారు. ఆక్వా లాబ్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలి..
రాష్ట్రంలో 7 ఫిషింగ్ హార్భర్లు, 5 ఫిష్ ల్యాండ్ సెంటర్లలో పనుల ప్రగతిపై సమీక్షించారు. 5 ఫిషింగ్ హార్బర్లు, 1 ఫిష్ ల్యాండ్ సెంటర్లో పనుల ప్రారంభమయ్యాయని.. మిగిలిన చోట్ల కూడా పనులు ప్రారంభించాలన్నాారు. కేజ్ ఫిష్ కల్చర్, మరీ కల్చర్‌లపై దృష్టి సారించాలన్న సీఎం.. పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్టు కింద మూడు చోట్ల కేజ్ ఫిష్ కల్చర్.. మూడు చోట్ల మరీకల్చర్‌ను మొదలుపెట్టాలని సూచించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింతగా విస్తరించాలన్నారు.
పశువుల ఆస్పత్రుల్లో నాడు–నేడుపై కార్యాచరణ