ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Jagan: ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రావొద్దు..: సీఎం జగన్ - agri infra projects in andhrapradesh

ఒక్క రైతుకు ఇబ్బంది రావొద్దు..ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోండి
ఒక్క రైతుకు ఇబ్బంది రావొద్దు..ధరల స్థిరీకరణ నిధి ద్వారా ఆదుకోండి

By

Published : Oct 8, 2021, 5:02 PM IST

Updated : Oct 8, 2021, 7:06 PM IST

16:52 October 08

రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రాకూడదు

రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది రాకుండా...ధరల స్థిరీకరణ నిధి ద్వారా అన్నదాతలను ఆదుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం..రైతులకు మంచి ధర వచ్చేలా చూడాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ పోటీని పెంచేలా చూడాలని, దీనివల్ల రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలన్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకే రైతులకు లభిస్తున్నాయన్నారు.

ఆర్బీకేలపై విష ప్రచారం..

దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా..రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామన్నారు ముఖ్యమంత్రి జగన్. అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. దీంట్లో భాగంగా పొటాష్‌ను తెప్పించుకున్నామని సీఎం వెల్లడించారు.ఆర్బీకేల్లో రైతులు ఆర్డర్లు పెట్టగానే వారికి ఎరువులు  అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారని  ఆక్షేపించారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావటం వారికి ఇష్టం లేనట్టుందని ఎద్దేవా చేశారు. ఎరువులు, విత్తనాల కోసం అప్పులు చేసి వడ్డీలు మీద వడ్డీలు చెల్లించే పరిస్థితులే కొనసాగాలన్నది వారి ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు.  

ప్రత్యమ్నాయ పంటలకు ప్రోత్సాహకం

ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. వచ్చే రబీ సీజన్‌ నుంచి ఇది అమల్లోకి వస్తోందన్నారు. వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బోర్ల కింద వరిని సాగుచేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్నారు. తృణ ధాన్యాలతో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. 33 చోట్ల సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తిగా అందుబాటులోకి వస్తాయన్నారు.  

ఆ రైతులే అమూల్​కు యజమానులు

'జగనన్న పాలవెల్లువ' కార్యక్రమంపైనా సీఎం జగన్ సమీక్షించారు. రైతులకు మేలు చేస్తున్న ఈ కార్యక్రమంపై కొందరు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అమూల్‌ ప్రైవేటు సంస్థ కాదని..పెద్ద సహకార ఉద్యమమన్నారు. పాలుపోసే రైతులే ఈ సంస్థకు యజమానులన్నారు. లాభాలన్నీ తిరిగి రైతులకే వస్తాయన్నారు. ఇలాంటి కార్యక్రమంపైనా విష ప్రచారానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అమూల్‌ వచ్చాక  పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతోందన్నారు. పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని ఆదేశాంచారు.  

బహిరంగ మార్కెట్‌ కంటే ఆర్‌బీకేల్లో తక్కువ ధరకే ఎరువుల లభిస్తాయి. ఆర్‌బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తున్న 'పాల వెల్లువ'పైనా దుష్ప్రచారం. అమూల్‌ ప్రైవేట్‌ సంస్థ కాదు..అది పెద్ద సహకార ఉద్యమం. పాడి రైతులే అమూల్‌ సంస్థకు యజమానులు. అమూల్ సంస్థలో లాభాలన్నీ తిరిగి రైతులకే వెళ్తాయి. అమూల్‌ వచ్చాక పాలసేకరణ ధర పెరిగి రైతులకు మేలు జరిగింది. ఆహారశుద్ధి యూనిట్ల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలి.- జగన్, ముఖ్యమంత్రి  

ఇదీ చదవండి

Durga Temple: దుర్గగుడి వద్ద అన్యమత ప్రచారంపై దర్యాప్తు

Last Updated : Oct 8, 2021, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details