CM Jagan Review on Paddy: రైతులకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) అనేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యకలాపాలు ముందుకు సాగాలంటే.. సంబంధిత శాఖలతో చక్కటి సమన్వయం అవసరమని అధికారులకు సూచించారు. ఫిషరీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ తదితర శాఖలతో సమన్వయం ఉండాలని అన్నారు. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు నిర్వహించాలని.. పురుగుమందులు, రసాయనాల వినియోగాన్ని తగ్గించేెందుకు అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రతీ రైతుకు తన భూమికి సంబంధించిన భూసార పరీక్ష కార్డులను క్రమం తప్పకుండా ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు.
రైతులకు అండగా నిలిచేందుకు.. సమన్వయంతో పని చేయాలి: సీఎం జగన్ - ఏపీ తాజా వార్తలు
CM REVIEW: ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండరాదని అధికారులను సీఎం జగన్ మరోసారి ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ, క్వాంటిటీ టెస్టింగ్ జరగాలని సూచించారు. ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని, కనీస మద్దతు ధరకు ఒక్క పైసా కూడా తగ్గరాదని నిర్దేశించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకుని, వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు.
రైతు సాగు చేస్తున్న భూమి స్థితిగతులు ఏంటి, ఎలాంటి పంటలకు అనుకూలం, ఎలాంటి రకాలు వేయాలి, ఎంత మోతాదులో ఎరువులు, పురుగుమందులు వాడాలన్న దానిపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఖరీఫ్, రబీ ముగిసిన తర్వాత సాయిల్‌టెస్టులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఖరీఫ్ పంటల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని, కనీస మద్దతు ధర కన్నా.. ఒక్క పైసా కూడా తగ్గకూడదని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని తెలిపారు. ఆర్బీకేల స్థాయిలోనే ధాన్యం క్వాలిటీ, క్వాంటిటీ టెస్టింగ్ జరగాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎంఎస్‌పీ, అనుసరించాల్సిన నియమాలపై కరపత్రాలు, పోస్టర్లు, హోర్డింగ్‌ల ద్వారా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో మోసాలు, అక్రమాలను నివారించడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్బీకేల స్థాయిలో వే-బ్రిడ్జిలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో గ్రామసచివాలయ మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తీసుకోవాలని.. వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి: