CM Jagan: ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ప్యారిస్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. జగన్ కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్‌లో చదువుతోంది. జులై 2న ఆమె కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన కూతురు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
డియర్ హర్ష.. నీ అద్భుతమైన ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇన్‌సీడ్ (INSEAD) బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్‌లో పాస్ కావడమే కాకుండా డీన్స్ లిస్ట్‌లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా. -సీఎం జగన్ ట్వీట్