ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'​ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు' - governor_sendoff_prog

గవర్నర్ నరసింహన్ ఆత్మీయ వీడ్కోలు సభకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులను సీఎం జగన్ సత్కరించారు. అనంతరం మాట్లాడిన జగన్ దశాబ్దం పాటు తెలుగు ప్రజలకు సేవలందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మరింత కాలం ప్రజాసేవలో ఉండాలని కోరారు.

గవర్నర్​ నరసింహన్​ ఓ తండ్రిలా మార్గనిర్దేశం చేశారు : సీఎం జగన్

By

Published : Jul 22, 2019, 9:16 PM IST

గవర్నర్ నరసింహన్‌తో పదేళ్లుగా పరిచయం ఉందని సీఎం జగన్‌ అన్నారు. తనను తండ్రిలా ఆదరించారని జగన్ పేర్కొన్నారు. నరసింహన్‌కు తమ గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. గవర్నర్​గా తెలుగు రాష్ట్రాలకు ఎనలేని సేవలు అందించారన్నారు. సీఎం అయ్యాక తనకు, రాష్ట్ర అభివృద్ధికి మార్గనిర్దేశం చేశారని గుర్తుచేసుకున్నారు. మరింత కాలం నరసింహన్ ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తండ్రి స్థానంలో ఉండి ఓ పెద్దాయనగా సలహాలు ఇచ్చారని నరసింహన్ సేవలు గుర్తు చేసుకున్నారు. నిండు మనస్సుతో ఆయన ఆశీస్సులు రాష్ట్రంపై ఉంటాయని భావిస్తున్నాని జగన్ అన్నారు.

గవర్నర్​ నరసింహన్​ ఓ తండ్రిలా మార్గనిర్దేశం చేశారు : సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details