గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. శాసనసభ విరామ సమయంలో గవర్నర్‌తో ఫోన్‌లో(CM Jagan talk to governor biswabhusan) మాట్లాడిన సీఎం.. ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఆరా తీశారు. బుధవారమే వైద్యులతో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడినట్లు చెప్పారు. సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చినట్లు వైద్యులు చెప్పారని గవర్నర్‌కు సీఎం వెల్లడించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు(ap Governor Biswabhusan Harichandan news) పేర్కొన్నారు. తన ఆరోగ్యం మెరుగవుతోందని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు.
హెల్త్ బులెటిన్ విడుదల..
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. గవర్నర్‌ను నిపుణుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోందని ఏఐజీ వైద్యులు వెల్లడించారు.
గవర్నర్ దంపతులకు కొవిడ్..
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రవ హరిచందన్‌లు కొవిడ్ బారిన(ap governor biswabhusan and wife tested covid positive) పడ్డారు. ఇటీవల దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో గవర్నర్ దంపతులకు ఈ నెల 15న ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)కి వారిని తరలించాలని రాజ్‌భవన్ మంగళవారమే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ ప్రక్రియ వెంటనే కుదరకపోవటంతో రాజ్‌భవన్ వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాయి. వారు బుధవారం హుటాహుటిన సైనిక విమానాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు పంపించారు. ఆ ప్రత్యేక విమానంలో గవర్నర్ దంపతులు మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీకి అంబులెన్సులో(ap governor tested covid positive) వెళ్లారు.