పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై మంత్రులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పథకాల వల్లే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతున్నామని మంత్రులు జగన్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు లిబర్టీ కంపెనీ అర్హత పొందిందని మంత్రులకు అధికారులు తెలిపారు. మొదటి విడతలో 10వేల కోట్లు, రెండవ విడతలో 5వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
అతివిశ్వాసం వద్దు.. మున్సిపల్ ఎన్నికల్లో మరింత కష్టపడాలి: సీఎం జగన్ - ఏపీ పంచాయతీ ఎన్నికలపై సీఎం జగన్ వ్యాఖ్యలు న్యూస్
పంచాయతీల్లో గెలిచామని అతి విశ్వాసంతో కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో మరింత కష్టపడాలని మంత్రులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మంత్రులతో ముఖ్యమంత్రి వివిధ అంశాలపై చర్చించారు.
cm jagan on panchayat elections result
TAGGED:
ap cabinet decisions news