ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

new education policy in ap: నూతన విద్యావిధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి: సీఎం జగన్​ - cm jagan on aided schools

నూతన విద్యావిధానాన్ని(new education policy in ap) సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. విద్యార్థులకు తగినట్లుగా టీచర్లను నియమించడం సహా అవసరమైన అన్ని చర్యలు(new education policy in andhra pradesh) తీసుకోవాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలలు ప్రభుత్వానికి అప్పగించడం పూర్తిగా స్వచ్ఛందమని సీఎం మరో సారి స్పష్టం చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో సమీక్షించారు.

cm jagan on new education policy
నూతన విద్యావిధానాన్ని సమర్థంగా అమలు చేయాలి: సీఎం జగన్​

By

Published : Nov 17, 2021, 8:29 PM IST

Updated : Nov 18, 2021, 6:32 AM IST

విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై తాడేపల్లిలోని క్యాంప్​ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్(new education policy in ap)​ సమీక్షించారు. నూతన విద్యా విధానం అమలుపై(cm jagan on new education policy) సీఎం చర్చించారు. నూతన విద్యావిధానంలో తీసుకున్న చర్యలు, వాటి అమలుపై సీఎం ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2021–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడు దశలుగా నూతన విద్యావిధానం పూర్తిగా అమలు చేయనున్నట్లు సీఎం(cm jagan reviews on new education policy) వివరించారు. 25 వేల 396 ప్రైమరీ పాఠశాలలను అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనమైనట్లు తెలిపారు. తొలిదశలో ఈ విద్యా సంవత్సరం 2వేల 663 స్కూళ్లు విలీనం చేశామన్నారు.

9.5 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది నుంచే..

2 లక్షల 5 వేల 71 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం.. ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని.. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

డైట్‌ సంస్థల సమర్థత పెంచాలి..

సీబీఎస్‌ఈ అఫిలియేషన్​పై సీఎం(cm jagan review on CBSE affiliation) సమీక్షించారు. 1092 పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగాయని ఈ సందర్భంగా అధికారులు వివరించారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. టీచర్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని సీఎం ఆదేశించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలన్నారు. టీచర్లకు శిక్షణా కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రతీ స్కూల్​లో ఒక నంబర్ ఉండేలా..

స్కూళ్లలో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే.. వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్‌ పెట్టాలన్న సీఎం.. ప్రతి స్కూల్​లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలన్నారు. ఈ కాల్‌సెంటర్​ నుంచి పర్యవేక్షణ అధికారులు ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంగ్లీషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, దీని కోసం పాఠ్యప్రణాళికలో దృష్టి పెట్టాలన్నారు.

ఎయిడెడ్‌ పాఠశాలల అప్పగింత పూర్తిగా స్వచ్ఛందం..

ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించాలన్నది పూర్తిగా స్వచ్ఛందమని సమావేశంలో సీఎం మరోసారి స్పష్టం(cm jagan on aided schools) చేశారు. వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందన్నారు. ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని.. లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. విలీనం చేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని జగన్​ తెలిపారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు.. ఇప్పుడు నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చన్నారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతంలేదు. ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని.. రాజకీయాలు కూడా తగవని ముఖ్యమంత్రి అన్నారు.

గోరుముద్దపై ఫీడ్​బ్యాక్ తప్పనిసరి..

పాఠశాలల్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు(cm jagan on Jagananna Gorumudda) చేయాలన్నారు. 'జగనన్న గోరుముద్ద'పై పిల్లలు, తల్లుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది, ఎక్కడ సమస్య ఉన్నా.. వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలన్న సీఎం.. స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్నారు. లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలన్న ముఖ్యమంత్రి.. ఇంటర్​నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలని అధికారులకు నిర్దేశించారు.

ఇదీ చదవండి..

విద్యుత్‌ ఉన్నతాధికారులతో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధుల భేటీ

Last Updated : Nov 18, 2021, 6:32 AM IST

ABOUT THE AUTHOR

...view details