ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​తో డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు భేటీ - రాష్ట్రంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ వార్తలు

cm jagan on drip irrigation : డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు.. సీఎం జగన్​తో సమావేశమయ్యారు. వచ్చే నెల నుంచి బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

cm jagan
cm jagan

By

Published : Mar 16, 2022, 5:33 AM IST

cm jagan on drip irrigation : వచ్చే నెల నుంచి బిందు సేద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అమలుచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎస్‌ ఎస్‌.శ్రీధర్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ హరినాధ రెడ్డి, డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. డ్రిప్‌ ఇరిగేషన్‌ అమలుచేసేందుకు తమ కంపెనీలు ప్రభుత్వానికి పూర్తి స్ధాయిలో సహకరిస్తాయని ముఖ్యమంత్రికి ప్రతినిధులు హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రికి డ్రిప్‌ ఇరిగేషన్‌ కంపెనీల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details