రాష్ట్రంలో కొవిడ్ నివారణ కార్యాచరణపై సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే.. ప్రజలకు ఇచ్చే సమర్థత మనకు ఉందని నిరూపించారని ప్రశంసించారు.
కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధప్రాతిపదికన జరగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో ప్రమాణాల అధ్యయనంపై ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. బిల్డింగ్, నాన్ బిల్డింగ్ సర్వీసులపై మాట్లాడారు. ఆస్పత్రి నిర్వహణపై ఎస్‌ఓపీలను తయారుచేయాలని సీఎం జగన్ అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీపడాలని ఆదేశించారు. ప్రమాణాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకూడదన్న సీఎం.. అత్యవసర వేళ రోగులను భద్రంగా తరలించే ప్రణాళికలు ఉండాలని సూచించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రోటోకాల్స్‌పై అధ్యయనం చేయాలని.. అన్ని అంశాలు అధ్యయనం తర్వాత సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: