UTF: సీపీఎస్ రద్దుపై ఈనెల 25 లోపు సీఎం జగన్ ప్రకటన చేయాలని.. యూటీఎఫ్ (ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) డిమాండ్ చేసింది. లేదంటే ఈ నెల 25న సీఎంవోను బైకులతో ముట్టడిస్తామని.. యూటీఎఫ్ నాయకులు హెచ్చరించారు. 2లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో సీపీఎస్ ముడిపడి ఉందని.. ఈ నెల 24లోపు ముఖ్యమంత్రితోనే ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
అధికారుల లెక్కలే తప్ప సీపీఎస్‌పై సమావేశాల్లో నిర్ణయాలు ఉండవు. బైక్ ర్యాలీలపై పోలీసులు నిర్భందాలు చేశారు. ఈనెల 24 లోపు సీఎంతోనే ఉపాధ్యాయుల సమావేశం పెట్టాలి. మేనిఫెస్టోలో మొదటి హామీ సీపీఎస్ రద్దు. మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదు.