CM MEETS GOVERNOR: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ సోమవారం రాజ్‌భవన్‌లో గంట పాటు సమావేశమయ్యారు. త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం పదికిపైగా బిల్లులను ప్రవేశపెట్టనున్న విషయాన్ని సీఎం.. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిసింది. కీలకమైన బిల్లుల ప్రాధాన్యాన్ని గవర్నర్‌కు వివరించినట్లు సమాచారం. ఆ బిల్లులేవన్నది బహిర్గతం కాలేదు. శాసనసభ ఉపసభాపతిని మార్చాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఉపసభాపతి కోన రఘుపతితో రాజీనామా చేయించి, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని నియమించనున్నారు. ఈ ఎన్నిక ప్రక్రియను వర్షాకాల సమావేశాల్లోనే చేపట్టనున్నట్లు గవర్నర్‌కు వివరించారు. అమరావతిలోని 25 ఎకరాల్లో రూ.40 కోట్ల వ్యయంతో తితిదే నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠకు రావాలని ఆహ్వానించారు. మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్లు తెలిసింది. కోనసీమలో అల్లర్లు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవలి తన దిల్లీ పర్యటన విశేషాలను వివరించారు. తొలుత సీఎం జగన్, ఆయన భార్య భారతి గవర్నర్ దంపతులను మర్యాదపూర్వకంగా జ్ఞాపికలను ఇచ్చి పుచ్చుకున్నారు.
CM MEETS GOVERNOR: గవర్నర్‌తో సీఎం జగన్ సమావేశం.. పలు అంశాలపై వివరణ..! - గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్
CM MEETS GOVERNOR: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. కోనసీమలో జరిగిన ఆందోళనలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు.
గవర్నర్‌తో సీఎం జగన్ సమావేశం.. పలు అంశాలపై వివరణ..!
Last Updated : Jun 7, 2022, 6:27 AM IST