ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM Meet Governor: గవర్నర్​ బిశ్వభూషణ్​తో సీఎం జగన్ భేటీ - గవర్నర్​ బిశ్వభూషణ్​తో సీఎం జగన్ భేటీ వార్తలు

మార్చి 7 నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగానికి గవర్నర్​ను సీఎం జగన్ ఆహ్వానించినట్లు సమాచారం.

గవర్నర్​ బిశ్వభూషణ్​తో సీఎం జగన్ భేటీ
గవర్నర్​ బిశ్వభూషణ్​తో సీఎం జగన్ భేటీ

By

Published : Feb 28, 2022, 9:20 PM IST

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మార్చి 7 నుంచి జరగనున్న రాష్ట్ర శాసన సభ బడ్జెట్‌ సమావేశాల గురించి గవర్నర్‌కు సీఎం వివరించారు. 7న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగానికి గవర్నర్​ను ఆహ్వానించినట్లు సమాచారం. మార్చి 8న ఇటీవల హఠాన్మరణం పొందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి ఉభయ సభల్లో సంతాపం తెలియజేయనున్నారు. 11న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు గవర్నర్‌కు సీఎం తెలియజేసినట్లు సమాచారం.

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారిని తమ స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యల గురించి కూడా గవర్నర్‌ వద్ద సీఎం ప్రస్తావించినట్లు తెలిసింది. అరగంట సేపు రాజభవన్‌లో ఉన్న సీఎం.. గవర్నర్‌తో సమావేశం అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details