ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎనిమిదేళ్లయినా విభజన సమస్యలు తీరలేదు.. అమిత్‌షాతో సీఎం జగన్ - ap latest news

CM JAGAN MEETS AMIT SHAH: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు.

CM JAGAN MEETS AMIT SHAH
ఎనిమిదేళ్లయినా విభజన సమస్యలు తీరలేదు- హోం మంత్రి అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి

By

Published : Jun 4, 2022, 7:15 AM IST

CM JAGAN MEETS AMIT SHAH: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా ఇప్పటికీ సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరం పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉదయం సీఎం హోం మంత్రితో సుమారు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. ‘రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ముఖ్యమంత్రి హోం మంత్రితో చర్చించారు. సౌత్‌ జోనల్‌ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు, వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశమూ ప్రస్తావనకు వచ్చింది. ఆస్తుల పంపకం సహా విభజన సమస్యలన్నీ పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి మరోమారు విజ్ఞప్తి చేశారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమావేశానంతరం జగన్‌ దిల్లీ నుంచి నేరుగా విజయవాడ వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details